Hyderabad: మణికొండలో వెంకటగిరి హ్యాండ్లూమ్స్‌ను ప్రారంభించిన నటి లయ!
Hyderabad: హైదరాబాద్ మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటగిరి హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను సినీ నటి లయ ఘనంగా ప్రారంభించి, ఇక్కడి సంప్రదాయ చేనేత చీరల కలెక్షన్స్‌పై ప్రశంసలు కురిపించారు.
Hyderabad: మణికొండలో వెంకటగిరి హ్యాండ్లూమ్స్‌ను ప్రారంభించిన నటి లయ!
హైదరాబాద్: మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటగిరి హ్యాండ్లూమ్స్ షోరూమ్‌ను ప్రముఖ సినీ నటి లయ ఘనంగా ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లోని వివిధ రకాల చీరలు, సంప్రదాయ చేనేత వస్త్రాలు, ప్రత్యేక డిజైన్లను పరిశీలించి ప్రశంసించారు.
కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయని, నాణ్యతతో పాటు అందమైన డిజైన్లు ఆకట్టుకుంటున్నాయని లయ అన్నారు. మన సంప్రదాయ చేనేత కళను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. వెంకటగిరి హ్యాండ్లూమ్స్ మరింత అభివృద్ధి సాధించాలని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.




