Yellampet: ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ కలకలం.. వార్డు అధికారి అరెస్ట్!

Yellampet: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ రావల్‌కోల్ వార్డు అధికారి రవీందర్ రెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 20 Nov 2026 6:28 PM IST
Yellampet
X

Yellampet: ఎల్లంపేట మున్సిపాలిటీలో ఏసీబీ కలకలం.. వార్డు అధికారి అరెస్ట్!

ఎల్లంపేట: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రావల్‌కోల్ వార్డులో విధులు నిర్వహిస్తున్న వార్డు అధికారి రవీందర్ రెడ్డి ఓ నిర్మాణానికి సంబంధించిన విషయంలో రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL