Uppal: మెప్మా అదనపు డైరెక్టర్ యాదగిరిరావు ఇంట్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు!
Uppal: మెప్మా అదనపు మిషన్ డైరెక్టర్ యాదగిరిరావు ఉప్పల్ నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
Uppal: మెప్మా అదనపు డైరెక్టర్ యాదగిరిరావు ఇంట్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు!
Uppal: తెలంగాణ మున్సిపల్ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అదనపు మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. యాదగిరి రావు నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు.
ఉప్పల్‌లోని హైకోర్టు కాలనీలో ఉన్న ఆయన నివాసానికి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం తెల్లవారుజామున చేరుకుని తనిఖీలు ప్రారంభించింది.ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
యాదగిరి రావుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయనకు వివిధ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించిన ఆస్తులపై కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నివాసంలో కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తనికీలు కొనసాగుతున్నాయి. సోదాలు పూర్తయిన తర్వాతే మొత్తం ఆస్తుల వివరాలు, తనిఖీల్లో గుర్తించిన అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏసీబీ అధికారుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.




