Abdullapurmet: ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ పదవీ విరమణ

Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ మొహ్సిన్ షరీఫ్ పదవీ విరమణ వేడుకను ఘనంగా నిర్వహించి సన్మానించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 30 Sept 2026 10:35 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ పదవీ విరమణ

అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన మొహ్సిన్ షరీఫ్ పదవీ విరమణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీవాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీవాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న మొహ్సిన్ షరీఫ్‌కు అభినందనలు తెలిపారు. ఉద్యోగ జీవితంలో ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ, పదవీ విరమణ అనంతరం దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని ఆకాంక్షించారు.

అనంతరం మొహ్సిన్ షరీఫ్ దంపతులను ఎంపీడీఓ శ్రీవాణి, ఎంపీఓ షఫీ ఉల్లా ఖాన్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిన్న రవిర్యాల సర్పంచ్ పబ్బత్ బాలకిషన్ గౌడ్, బండరావిర్యాల సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, గుంతపల్లి సర్పంచ్ అంతటి హేమలత జంగయ్య గౌడ్, పిగ్లీపూర్ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సర్పంచ్ మందుగల విజయ శ్రీశైలం గౌడ్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR