Abdullapurmet: ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ మహాసభలను జయప్రదం చేయాలి!
Abdullapurmet: హనుమకొండలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలు, రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కుంట్లూర్‌లో పోస్టర్ ఆవిష్కరణ.
Abdullapurmet: ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ మహాసభలను జయప్రదం చేయాలి!
Abdullapurmet: ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమకొండలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ అబ్దుల్లాపూర్‌మెట్ మండల అధ్యక్షుడు వినోద్ నాయక్, కార్యదర్శి చింతా వెంకటేష్ పిలుపునిచ్చారు. కుంట్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గేటు ఎదుట మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉద్యమిస్తామని తెలిపారు. విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను అరికట్టి, ఉపాధ్యాయులు, విద్యాశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు.
మహాసభలకు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సత్యం, చందు, నిఖిల్, ఆశోక్, లక్కీ, ఎల్. రామ్‌చరణ్, శివకుమార్, పి. రామ్‌చరణ్, రాఘవ తదితరులు పాల్గొన్నారు.




