Abdullahpurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

Abdullahpurmet: అబ్దుల్లాపూర్‌మెట్ మండల ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 18 Oct 2026 5:33 PM IST
Abdullahpurmet
X

Abdullahpurmet: అబ్దుల్లాపూర్‌మెట్‌లో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

అబ్దుల్లాపూర్‌మెట్: అబ్దుల్లాపూర్‌మెట్ మండల ముస్లిం మైనారిటీ కమిటీ సమన్వయంతో నేడు డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యువతకు, కార్యక్రమానికి హాజరైన ప్రజలకు వివిధ రకాల మాదకద్రవ్యాలు, వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. డ్రగ్స్‌ వ్యసనానికి గురైన వారిలో కనిపించే లక్షణాలు, ముందస్తు హెచ్చరిక సంకేతాలపై అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారిని సరైన కౌన్సెలింగ్‌, వైద్య చికిత్స, పునరావాసం ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించారు. డ్రగ్స్‌ దుర్వినియోగాన్ని అరికట్టడంలో యువతతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాలను వినియోగించే వారు, విక్రయించే వారు, అక్రమంగా సరఫరా చేసే వారి సమాచారం పోలీసులకు అందించాలని, అలాంటి అక్రమ కార్యకలాపాలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రజలందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR