Talakondapally: పోషకాహారం, విద్యపై అవగాహన అవసరం: సర్పంచ్ శేఖర్!
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.
Talakondapally: పోషకాహారం, విద్యపై అవగాహన అవసరం: సర్పంచ్ శేఖర్!
తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తలకొండపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, తలకొండపల్లి సర్పంచ్ కటికెల శేఖర్ యాదవ్ పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలలో విద్యతో పాటు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కార్యక్రమంలో వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లలిత జ్యోతయ్య, ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజయ్య శెట్టి, వార్డు సభ్యులు వెంకటేష్ యాదవ్, కిషోర్, విఠల్, అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, గ్రామ మహిళలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.




