Chevella: చేవెళ్లలో 90 ఏళ్ల వృద్ధురాలి బంగారం లాక్కున్న మహిళ అరెస్ట్
Chevella: చేవెళ్ల మండలం పల్గుట్టలో 90 ఏళ్ల వృద్ధురాలి వద్ద బంగారం లాక్కెళ్లిన పాత నేరస్తురాలు బైండ్ల బాలమ్మను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Chevella: చేవెళ్లలో 90 ఏళ్ల వృద్ధురాలి బంగారం లాక్కున్న మహిళ అరెస్ట్
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం, పల్గుట్ట గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలి బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కొని పరారైన నిందితురాలిని చేవెళ్ల పోలీసులు కేసు నమోదైన 24 గంటల్లోనే గుర్తించి, అదుపులోకి తీసుకుని, న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
*నిందితురాలి వివరాలు:*
బైండ్ల బాలమ్మ, భర్త వెంకటయ్య, వయస్సు 53 సంవత్సరాలు, వృత్తి: కూలీ, కులం: ఎస్సీ–బైండ్ల, నివాసం: ఇంటి నం. 3-12, కందవాడ గ్రామం, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా.
*కేసు వివరాలు:*
తేదీ 23.10.2026న మధ్యాహ్నం సుమారు 14:00 గంటలకు పల్గుట్ట గ్రామానికి చెందిన శ్రీమతి సంకూరి అనిత, వయస్సు 45 సంవత్సరాలు, అంగన్వాడీ టీచర్, తన అత్తగారు వెంకటమ్మ, వయస్సు 90 సంవత్సరాలు, పాత ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారు ప్రతిరోజూ ఉదయం తన అత్తగారికి భోజనం పెట్టిన అనంతరం అంగన్వాడీ కేంద్రానికి విధులకు వెళ్తుంటారు.
అదే విధంగా, 23.10.2026న ఉదయం సుమారు 09:00 గంటలకు తన అత్తగారికి భోజనం పెట్టి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సుమారు 14:00 గంటలకు గ్రామానికి చెందిన చాకలి వెంకటేష్ ఫోన్ చేసి, గుర్తు తెలియని మహిళ తన అత్తగారి ఇంట్లోకి ప్రవేశించి బంగారు ఆభరణాలను లాక్కొని పారిపోయిందని సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఇంటికి చేరుకుని విచారించగా, వృద్ధురాలు భోజనం చేస్తుండగా ఒక మహిళ ఇంట్లోకి ప్రవేశించి, భోజన పాత్రను పక్కకు జరిపి, జుట్టు సరిచేస్తున్నట్లు నటిస్తూ, అదును చూసుకుని ఆమె వద్ద ఉన్న సుమారు ఒక తులం బంగారు గుండ్లను బలవంతంగా లాక్కొని పారిపోయినట్లు తెలిసింది.
ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేగంగా దర్యాప్తు నిర్వహించి, నిందితురాలు బైండ్ల బాలమ్మను *కేసు నమోదైన 24 గంటల్లోనే గుర్తించి, అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.*
*దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఇతర వివరాలు:*
పోలీసుల దర్యాప్తులో నిందితురాలు బైండ్ల బాలమ్మ గతంలో కూడా హత్య మరియు దొంగతనం కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నట్లు తెలిసింది. ఈ అంశాలకు సంబంధించి పోలీసులు తదుపరి వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.




