Secunderabad: 9 గంటల నిర్విరామ భరతనాట్యం: తలసాని ప్రశంస

Secunderabad: సికింద్రాబాద్ హరిహర కళాభవన్‌లో లాలి నిధి చేపట్టిన 9 గంటల నిర్విరామ భరతనాట్య ప్రదర్శనను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశంసించారు.

Srikanth, Secunderabad
Published on: 25 Oct 2026 2:10 PM IST
Secunderabad
X

Secunderabad: 9 గంటల నిర్విరామ భరతనాట్యం: తలసాని ప్రశంస

సికింద్రాబాద్: తొమ్మిది గంటలు నిర్విరామంగా భారత నాట్యయం చేయడం సాహసోపేతమైన శక్తి అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళా భవన్ లో లాలి నిధి అనే యువతి తొమ్మిది గంటలు ఆగకుండా భరత నాట్యం చేస్తుండగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లాలి నిధిని అభినందించారు.

మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతున్న వేల ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించిన వారు అవుతారని తలసాని అన్నారు..గతంలో ఆరు గంటలు ఆపకుండా నృత్యం చేసిన లాలి నిధి ఆరోసారి తొమ్మిది గంటలు ఆగకుండా నృత్యం చేసి మరో రికార్డు చేస్తుందని తలసాని పేర్కొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad