Hyderabad: హఫీజ్ బాబానగర్‌లో దారుణ హత్య.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!
Hyderabad: కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్ బాబానగర్‌లో అద్దె ఇంటి వివాదం నేపథ్యంలో జరిగిన హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: హఫీజ్ బాబానగర్‌లో దారుణ హత్య.. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు!
Hyderabad: కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య, హత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. హఫీజ్ బాబానగర్‌లోని పత్తర్ కా మఖాన్, బి బ్లాక్‌లో నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
అద్దె ఇంటి వివాదం నేపథ్యంలో మషల్లా ఒమర్‌ను మాట్లాడేందుకు పిలిపించి, పలువురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో మెడకు తీవ్ర గాయాలై మషల్లా ఒమర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సయ్యద్ బిన్ మెహఫూజ్‌పైనా నిందితులు కత్తితో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు.
మూడు రోజులుగా తన కుమారుడిని చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కంచన్‌బాగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, క్రిమినల్ కుట్రతో హత్య, హత్యాయత్నానికి పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ అయిన నిందితులు :
అమన్ ఖురేషీ - ప్రధాన నిందితుడు, ఖాలేద్ భైసా, జాఫర్ బిన్ హవల్, అబ్రార్, ఇమ్రాన్, మొహమ్మద్ ఖురేషీ




