Medchal: మేడ్చల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదేళ్ల బాలుడు మృతి!

Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కండ్లకోయ–గౌడవెల్లి రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు రేవంత్ అక్కడికక్కడే మృతి చెందాడు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 18 Nov 2026 10:42 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదేళ్ల బాలుడు మృతి!

మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కండ్లకోయ నుంచి గౌడవెల్లి వెళ్లే రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు రేవంత్ మృతి చెందాడు.

ప్రమాద తీవ్రతకు చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL