Hyderabad: చింతల్‌లో విషాదం.. సైనేడ్ ముట్టుకుని రెండున్నరేళ్ల చిన్నారి మృతి!
Hyderabad: జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్‌లో విషాదం. విష్ణు జ్యువెలరీ షాప్ వద్ద సైనేడ్ ముట్టుకుని రెండున్నరేళ్ల చిన్నారి మృతి.
Hyderabad: చింతల్‌లో విషాదం.. సైనేడ్ ముట్టుకుని రెండున్నరేళ్ల చిన్నారి మృతి!
Hyderabad: చింతల్ సస్తా బజార్ ఎదురుగా విష్ణు జ్యువెలరీ వద్ద బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బంగారం కొనుగోలు చేసేందుకు తల్లితో కలిసి వచ్చిన రెండేళ్ల ఐదు నెలల చిన్నారి మిష సైనేడ్ పదార్థాన్ని ముట్టుకోవడంతో మృతి చెందినట్లు సమాచారం. మిషా ఆడుకుంటూ ఒక్కసారిగా జ్యువెలరీ షాప్ నుంచి బయటికి వచ్చింది. బయట గోల్డ్ కు సంబంధించిన వర్కర్ సైనేడ్ వదిలేసి వెళ్లిపోవడంతో ఆ పాప తెలియక తాగి మృతి చెందింది.
పాపని చింతల్ లోని పలానా హోస్పత్రికి షాప్ యజమాని తరలించాడు, అయితే అక్కడ పాపం మృతి చెందిన సంఘటన తెలుసుకున్న తర్వాత పాపని హాస్పిటల్ ని వదిలేసి వచ్చిన యజమాని. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




