Malkajgiri: మైనంపల్లి హనుమంతరావు చొరవతో 25 మందికి పెన్షన్ల మంజూరు!
Malkajgiri: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చొరవతో మల్కాజిగిరి వినాయక నగర్ డివిజన్‌లో 25 మంది అర్హులకు పెన్షన్లు మంజూరైనట్లు పిట్టల నాగరాజు తెలిపారు.
Malkajgiri: మైనంపల్లి హనుమంతరావు చొరవతో 25 మందికి పెన్షన్ల మంజూరు!
మల్కాజిగిరి: వినాయక నగర్ డివిజన్ పరిధిలో పెన్షన్లకు అర్హులైన వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు సహా 150 మందికి పైగా ఉన్నట్లు గుర్తించగా,వారిలో 25 మంది అర్హులను 185వ డివిజన్ అధ్యక్షుడు, పీఎన్ఆర్ బృందం సభ్యులు పిట్టల నాగరాజు ప్రత్యేకంగా గుర్తించి పెన్షన్లు మంజూరయ్యేలా కృషి చేశారు.
ఈ విషయాన్ని మాజీ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకెళ్లగా,ఆయన చొరవతో సంబంధిత మండల రెవెన్యూ అధికారికి (ఎంఆర్ఓ) సమస్యను వివరించారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హతలను నిర్ధారించిన అనంతరం 25 మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు పిట్టల నాగరాజు తెలిపారు.
ఈ సందర్భంగా పెన్షన్లు మంజూరుకు సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న తనను అభినందిస్తూ పలువురు ధన్యవాదాలు తెలియజేయడం సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం అభినందనీయమని, ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు తన పీఎన్ఆర్ బృందంతో నిరంతరం కృషి చేస్తానని పిట్టల నాగరాజు పేర్కొన్నారు.




