LB Nagar: కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.. పార్టీలోకి 200 మంది యువత!

LB Nagar: సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో చేరిన 200 మంది యువత. కండువా కప్పి ఆహ్వానించిన శివచరణ్ రెడ్డి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 4 Oct 2026 1:40 PM IST
LB Nagar
X

LB Nagar: కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.. పార్టీలోకి 200 మంది యువత!

LB Nagar: సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జీఎస్ఐ డివిజన్‌కు చెందిన సుమారు 200 మంది యువత ప్రజా ప్రభుత్వనికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి జక్కిడి శివచరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన జీఎస్ఐ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జైకృష్ణ యాదవ్‌ను, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షుడిగా గణేష్ గౌడ్‌ను నియమించినట్లు తెలిపారు.

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి–మహబూబ్‌నగర్- హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్‌గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రానున్న ఎంఎంసీ, జీహెచ్‌ఎంసీ, సిఎంసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని శివచరణ్ రెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నూతనంగా ఏర్పడిన అన్ని డివిజన్లలో యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేసి, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పారు.

యువతను కాంగ్రెస్ పార్టీ వైపు మరింతగా ఆకర్షించేలా కార్యక్రమాలు చేపడతామని జక్కిడి శివచరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR