Kothapet: కేసీఆర్ దీక్షకు 17 ఏళ్లు.. కొత్తపేటలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు!

Kothapet: కేసీఆర్ దీక్షకు 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎల్బీనగర్ కొత్తపేట మోహన్ నగర్‌లో మాజీ కార్పొరేటర్ జి.వి. సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివస్ జరిగింది.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 29 Nov 2026 3:42 PM IST
Kothapet
X

Kothapet: కేసీఆర్ దీక్షకు 17 ఏళ్లు.. కొత్తపేటలో ఘనంగా దీక్షా దివస్ వేడుకలు!

ఎల్బీనగర్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టమని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా కొత్తపేట డివిజన్ మోహన్ నగర్‌లో ఆదివారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ జి.వి. సాగర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష, ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను నాయకులు స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్నారు.

కార్యక్రమంలో ఎం.డి. జయర్కాన్, బీఆర్ఎస్వీ మాజీ ఇన్‌చార్జ్, రంగారెడ్డి జిల్లా కొత్తపేట డివిజన్ మాజీ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, బీఆర్ఎస్వీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గుండమల్ల పాండు గౌడ్, మాజీ వార్డు సభ్యులు రూప, పద్మ, శ్రీను, భాస్కర్, రాజు, సంజు, రఘు, సంజీవ్, హారిక తదితరులు పాల్గొన్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR