Hyderabad: కేవలం మూడు నెలల శిక్షణతోనే తొలి ప్రయత్నంలో అరుదైన ఘనత సాధించిన 16 ఏళ్ల రిషిత!

Hyderabad: జైపూర్‌లో జరిగిన స్టార్ మిస్ టీన్ ఇండియా 2026 పోటీల్లో హైదరాబాద్ విద్యార్థిని రిషిత పెన్మెత్స ఫస్ట్ రన్నరప్‌గా నిలిచి జాతీయస్థాయిలో సత్తా చాటింది.

RAJESH,	WEST ZONE
Published on: 25 Nov 2026 3:12 PM IST
Hyderabad
X

Hyderabad: కేవలం మూడు నెలల శిక్షణతోనే తొలి ప్రయత్నంలో అరుదైన ఘనత సాధించిన 16 ఏళ్ల రిషిత!

Hyderabad: హైదరాబాద్‌కు చెందిన 16 ఏళ్ల రిషిత పెన్మెత్స జాతీయస్థాయి అందాల పోటీల్లో సత్తా చాటింది. జైపూర్‌లో నిర్వహించిన స్టార్ మిస్ టీన్ ఇండియా – 2026 పోటీల్లో 31 మంది యువతులతో పోటీపడి ఫస్ట్ రన్నరప్ టైటిల్‌ను కైవసం చేసుకుందఒబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న రిషితకు ఇది తొలి అందాల పోటీ కావడం విశేషం.

కేవలం మూడు నెలల శిక్షణతోనే ఈ ఘనత సాధించింది. భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని రిషిత తెలిపింది. తొలి ప్రయత్నంలోనే జాతీయస్థాయిలో విజయం సాధించిన రిషితపై పలువురు అభినందనలు కురిపిస్తున్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE