Secunderabad: కంటోన్మెంట్లో 1,500 మందికి కొత్త పెన్షన్ల మంజూరు!
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1,500 మందికి మంజూరైన కొత్త పెన్షన్ పత్రాలను కలెక్టర్ ప్రియాంక ఆల, ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం అందజేశారు.
Secunderabad: కంటోన్మెంట్లో 1,500 మందికి కొత్త పెన్షన్ల మంజూరు!
సికింద్రాబాద్: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మంజూరైన కొత్త పెన్షన్ దారులకు కలెక్టర్ ప్రియాంక ఆల ముఖ్య అతిధిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేష్, నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ గారితో కలిసి మంజూరు పత్రాలను అందచేసారు. పేదల కోసం ఆలోచించే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని, కొత్త పెన్షన్లను మంజూరు చేయడం సంతోషమగా ఉందని ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు.
ప్రజా పాలన లో అర్హులైన పేదలకు కొత్త పెన్షన్లు ఇస్తున్నామని ఆయన అన్నారు. పెన్షన్ అంటే ఒక ఆత్మ గౌరవం ఒక భరోసా అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ కు మహిళలంటే ఎంతో గౌరవం అని, అందుకే ప్రభుత్వ పథకాలకు ఇందిరా గాంధీ పెరు పెడుతున్నారని ఆయన అన్నారు.
గతంలోని బిఅరెస్ ప్రభుత్వం ఖజానా ను అప్పుల పాలు చేసిందని, అందుకే కొత్త పథకాలు తీసుకురావడానికి కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గములో 2000 మంది పెన్షన్ కోసం నమోదు చేసుకోగా 1500 మందికి పెన్షన్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.




