LB Nagar: ఎల్బీనగర్లో కేకేసీలోకి భారీగా చేరికలు!
LB Nagar: ఎల్బీనగర్లో కార్మికుల కర్షకుల కాంగ్రెస్ (KKC)లో వివిధ రంగాలకు చెందిన 150 మంది కార్మికులు, ఉద్యోగులు భారీగా చేరారు.
LB Nagar: ఎల్బీనగర్లో కేకేసీలోకి భారీగా చేరికలు!
LB Nagar: అసంఘటిత కార్మికుల హక్కుల పోరాటానికి మరింత బలం చేకూరింది. ఎల్బీనగర్ వేదికగా కార్మికుల కర్షకుల కాంగ్రెస్ (KKC)లో భారీగా చేరికలు జరిగాయి. వివిధ రంగాలకు చెందిన సుమారు 150 మంది కార్మికులు, ఉద్యోగులు కేకేసీ నాయకత్వంపై నమ్మకంతో సంస్థలో చేరారు. దీంతో తెలంగాణలో కేకేసీ మరింత బలోపేతమైంది.
అసంఘటిత రంగ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేకేసీ జాతీయ చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజ్ నాయకత్వంలో, జాతీయ వైస్ చైర్మన్ డాక్టర్ నవాబ్ ఇబ్రహీం షేక్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ కౌశల్ సమీర్ సారథ్యంలో చేరికల కార్యక్రమం జరిగింది.
కేకేసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. రాజశేఖర్ రెడ్డి, అబ్దుల్ జిలాని, మున్నా జానీ, జిల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతమైంది.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారికి న్యాయం జరిగేలా కేకేసీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. కార్మికులకు సరైన గుర్తింపు, సంక్షేమ పథకాలు, హక్కుల పరిరక్షణ కోసం సంస్థ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఒకేసారి 150 మంది కార్మికులు, ఉద్యోగులు సంస్థలో చేరడం కేకేసీపై పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు వెల్లడించారు.
కార్మికుల ఐక్యతే తమ బలమని, ప్రతి కార్మికుడికి అండగా నిలవడమే కేకేసీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు, స్థానిక కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.




