AS Rao Nagar: ఘనంగా డాక్టర్ హోమీ జే బాబా 117వ జయంతి
AS Rao Nagar: ఏఎస్ రావు నగర్‌లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్పూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ హోమీ జే బాబా 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
AS Rao Nagar: ఘనంగా డాక్టర్ హోమీ జే బాబా 117వ జయంతి
AS Rao Nagar: తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్ హోమీ జే బాబా 117వ జయంతి, డాక్టర్ ఎఎస్ రావు నగర్ లోని డాక్టర్ హోమీ జే బాబా ఫంక్షన్ హాల్ నందు కలిగిన డాక్టర్ హోమి జే బాబా విగ్రహం దగ్గర సంస్మరణ సభ జరిగింది. సభా కార్యక్రమానికి స్పూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షత వహించారు.
ముందుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి , ఎన్ఎఫ్సీ సీనియర్ నాయకులు ఉదయ భాస్కర్ డాక్టర్ హోమీ జే బాబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ హోమి జే బాబా భారతదేశం అణురంగంలో శాంతియుత ప్రయోజనాల కొరకు ఎంతో కృషి చేశారని చెప్పారు.
దేశ స్వావలంబన కొరకు జీవితకాలం కృషి చేశారని అన్నారు. అణు శక్తి రంగంలోనే కాకుండా ఎలక్ట్రానిక్స్ రంగులోను, భౌతిక శాస్త్రంలోనూ ఎన్నో ప్రయోగాలు చేసి నూతన ఆవిష్కారాలు చేశారని చెప్పారు. వారి కృషి ఫలితంగా వచ్చిన ఎన్ ఎఫ్ సి, ఈసీఐఎల్ సంస్థల ద్వారా మొత్తం మన ఏరియా అంతా సుభిక్షంగా తయారైందని అన్నారు. వారికి ఈ సందర్భంగా నివాళులర్పించారు.
స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ డాక్టర్ ఒమీ జే బాబా ఉన్నతమైన పార్సీ కుటుంబంలో జన్మించినప్పటికీ భారతదేశ ఔన్నత్యాన్ని నిలపడం కోసం సామాన్య ప్రజలకు విజ్ఞాన ఫలాలు అందించడం కొరకు సుదీర్ఘకాలం కృషి చేశారని చెప్పారు. లండన్ లో ఉన్నత చదువు చదివినప్పటికీ భారతదేశంలో పూర్తి సామర్థ్యం తోటి ప్రజా అనుకూల ఆవిష్కరణలు చేశారని చెప్పారు.
డాక్టర్ ఏఎస్ రావు గారు హోమి జే బాబా ను తన గురువుగా అన్ని సందర్భాల్లో చెప్పే వారిని చెప్పారు. స్వాతంత్ర అనంతరం దేశాన్ని అభివృద్ధి పరచాలంటే అన్ని రంగాలలో స్వయం సమృద్ధి సాధించాలని దాని కోసం అహర్నిశలు కృషి చేశారు. భారతదేశం అణురంగంలో అభివృద్ధి ఇవ్వడం ఇష్టపడని అమెరికా సీఐఏ కుట్రతో విమాన ప్రమాదంలో చంపేశారని చెప్పారు.
హోమీ జయంగీర్ బాబా విజ్ఞానం ఒకటే కాకుండా కళా రంగంలోనూ కూడా ఆయనకు ప్రవేశం ఉందని చెప్పారు. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కళాకారుల సంస్థ ఇఫ్టా పేరును ఆయనే ప్రతిపాదించారని చెప్పారు.
ప్రజా జీవనంలో ప్రజలకు అందుబాటులో ఉండే జీవనశైలి గలిగిన గొప్ప దార్శనీకుడని అన్నారు. అధ్యక్షులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ దేశం గౌరవించదగ్గ గొప్ప మహనీయునికి భారతరత్న ఇవ్వాల్సింది పోయి ఇప్పటికీ అమెరికా లాంటి ప్రభుత్వాలకు వెరసి ఆయనకు ఇప్పటివరకు భారతరత్న ఇవ్వలేదని అన్నారు. ఈసీఐఎల్ నిర్మాత డాక్టర్ ఏఎస్ రావు గారు కూడా డాక్టర్ హోమీ జే బాబాకు భారతరత్న రాలేదని ఎంతో బాధపడ్డారు అని అన్నారు.
అనంతరం హాజరైన పెద్దలు స్కూలు విద్యార్థులు హోమియో బాబా విగ్రహానికి పూలను వేసి నివాళులర్పించారు. అమర్ రహే డాక్టర్ హోమీ జే బాబా అని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొత్త రామారావు , కాసం మహిపాల్ రెడ్డి , చల్లా లీలావతి, శారద, శ్రావణ్ కుమార్, బాలు, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, శ్రీమన్నారాయణ, పాషా, సత్యనారాయణ, సదాశివ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.




