Shamirpet: ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని కాపాడిన 108 సిబ్బంది!

Shamirpet: శామీర్పేట మండలం మజీద్పూర్‌లో ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించిన యువతి. సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది యాదమ్మ, శాంతి కుమార్.

NAKSHATRAM, MEDCHAL
Published on: 22 Sept 2026 8:06 AM IST
Shamirpet
X

Shamirpet: ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని కాపాడిన 108 సిబ్బంది!

Shamirpet: శామీర్పేట మండలం మజీద్పూర్ ఊరికి చెందిన మంజుల మరియు నరసింహుల కుమార్తె రొండ్ల భావన వయస్సు 18 సం. సాయంత్రం 7.30 నిముషాల సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయగా తల్లితండ్రులు చూసి 108 అంబులెన్సుకు ఫోన్ చేసి సమాచారం అందించగా శామీర్పేట్ అంబులెన్సు సిబ్బంది EMT యాదమ్మ మరియు పైలట్ శాంతి కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్ చక్రవర్తి గారి సూచనల మేరకు ప్రథమ చికిత్స అందుస్తూ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చేరుకొని భావనను కాపాడినందుకు బాధితురాలి తల్లిదండ్రులు EMT యాదమ్మను మరియు పైలట్ శాంతి కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL