Bowenpally: బోయిన్‌పల్లి సప్తమి గ్రాండ్‌లో ఫుడ్ అధికారుల తనిఖీలు

Bowenpally: బోయిన్‌పల్లి సప్తమి గ్రాండ్ ఉడుపి రెస్టారెంట్‌లో ఆహారం తిని 10 మంది అస్వస్థతకు గురికావడంతో ఫుడ్ అధికారులు తనిఖీ చేసి నోటీసులు జారీ చేశారు.

Srikanth, Secunderabad
Published on: 31 Oct 2026 4:52 PM IST
Bowenpally
X

Bowenpally: బోయిన్‌పల్లి సప్తమి గ్రాండ్‌లో ఫుడ్ అధికారుల తనిఖీలు

సికింద్రాబాద్: బోయిన్‌పల్లిలోని ప్రముఖ సప్తమి గ్రాండ్ ఉడుపి రెస్టారెంట్‌లో దారుణ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. నాసిరకం ఆహారం అందించడంతో ఆహారం తిన్న పది మంది అస్వస్థతకు గురికావడంతో కంటోన్మెంట్ ఫుడ్ అధికారులు ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అధికారులు చూసిన దృశ్యాలు దిగ్భ్రాంతిని కలిగించాయి.

ఆహారం తయారు చేసే కిచెన్‌లో నిల్వ ఉంచిన పదార్థాల్లో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ, వాటి మలమూత్రాలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలోనే వంటలు తయారు చేస్తున్నట్లు తేలింది.దీంతో హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన అధికారులు,హోటల్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad