కొబ్బరి సాగులో రైతు కొత్త ప్రయోగం.. తక్కువ స్థలంలోనే రకరకాల పంటలతో లాభాలు!

Coconut Farming: ఖమ్మం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు వెంకట్రామిరెడ్డి కొబ్బరి సాగులో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

Arun Chilukuri
Published on: 19 Sept 2026 12:31 PM IST
కొబ్బరి సాగులో రైతు కొత్త ప్రయోగం.. తక్కువ స్థలంలోనే రకరకాల పంటలతో లాభాలు!
X

కొబ్బరి సాగులో రైతు కొత్త ప్రయోగం.. తక్కువ స్థలంలోనే రకరకాల పంటలతో లాభాలు!

Coconut Farming: ఖమ్మం జిల్లా మధిరకు చెందిన అభ్యుదయ రైతు వెంకట్రామిరెడ్డి ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువులకు స్వస్తి పలికి, తక్కువ స్థలంలోనే అత్యధిక లాభాలు పొందేలా సరికొత్త విధానాలను అవలంబిస్తున్నారు.

ఎకరంన్నర పొలంలో కొబ్బరి సాగు చేస్తూ, అందులో అరటిని అంతర పంటగా పెంచుతున్నారు. అంతేకాకుండా ఇంటి అవసరాల కోసం దానిమ్మ, జామ, ఆపిల్ బేర్, మామిడి, ఉసిరి వంటి వివిధ రకాల పండ్ల మొక్కలను కూడా సాగు చేస్తున్నారు.

పంటల ఎదుగుదల కోసం రసాయనాలకు బదులుగా చేపల వ్యర్థాలతో తయారు చేసిన 'ఫిష్ అమైనో యాసిడ్', జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజ ద్రావణాలను ఉపయోగిస్తున్నారు.

పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటూ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నాణ్యమైన సహజ పంటలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.