Palnadu: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోంది వైసీపీనే: కన్నా లక్ష్మీనారాయణ
Palnadu: స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను వైసీపీ కోర్టుల ద్వారా అడ్డుకుంటోందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Palnadu: బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోంది వైసీపీనే: కన్నా లక్ష్మీనారాయణ
పల్నాడు జిల్లా: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్, ఎన్టీఆర్ హయాంలో బిసిల పక్షాన నిలబడిన రాజకీయ పార్టీ టీడీపీ.చంద్రబాబు కూడా అదే విధానాన్ని కొనసాగించారు.
2024 ఎన్నికల్లో బిసిలకు కూటమి 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తే , వైసీపీ 24శాతం రిజర్వేషన్ కల్పించింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో ప్రభుత్వం చట్టం చేస్తే ,వైసీపీ కోర్టు కు వెళ్లి అడ్డంకులు కల్పిస్తున్నారు.
బిసి రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వైసీపీ, స్థానిక ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్ కల్పించాలని టీడీపీ ప్రయత్నం, బిసిలకు కూటమి అన్యాయం చేస్తుందని వైసీపీ తప్పుడు ప్రచారం.
మొదటి నుంచి వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ పార్టీ కి గొడ్డలి పార్టీ అని కొత్త పేరు పెట్టారు. వైస్ రాజశేఖర్ రెడ్డి కి అబద్దం చెప్పటం చేతకాదు ..జగన్ కు నిజం చెప్పటం చేతకాదు, ఒక్క సారి కూడా జగన్ నిజం చెప్పలేదు.
అబద్ధాలు మోసాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ, జగన్ ఒక్క చాన్స్ తో ప్రజలు మోసపోయారు. 2024ఎన్నికల్లో ప్రజలు జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, 2024ఎన్నికలలో ప్రజలు జగన్ తిరస్కరించారు. జగన్ పద్దతి మార్చుకోవాలి.




