Guntur: అప్పిరెడ్డిపై అక్రమ కేసులు సరికాదు: వైసీపీ నేతల తీవ్ర విమర్శలు

Guntur: గుంటూరులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై పెట్టిన కేసులను ఖండిస్తూ వైసీపీ నేతలు తోట త్రిమూర్తులు, వరుదు కళ్యాణి, అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 12 Nov 2026 3:07 PM IST
Guntur
X

Guntur: అప్పిరెడ్డిపై అక్రమ కేసులు సరికాదు: వైసీపీ నేతల తీవ్ర విమర్శలు

గుంటూరు: కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్సుల్లో నల్లపాడు వద్ద ఒక బాక్స్ దించేశారు. వైసిపి అభ్యర్థి, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించారు. ఆ తర్వాత అప్పిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. నిరసన చేస్తున్న వైసిపి శ్రేణులు, అప్పిరెడ్డి పై లాఠీ ఛార్జి చేశారు.

అప్పిరెడ్డి పై రేప్, మర్డర్ కేసు తప్ప అన్ని సెక్షన్ల కింద కేసు పెట్టారు. బ్యాలెట్ బాక్సులు పక్కదారి పట్టిస్తున్నవారి పై కేసులు పెడతారా, అక్రమాలను ప్రశ్నించిన వారి పై కేసులు పెడతారా, ఈ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. చిన్న గొడవ అని చెప్పి అనేక రకాల కేసులు పెట్టారు.

రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోకతప్పదు, మీరు తలకిందులుగా తపస్సు చేసినా 2029లో వైసిపి గెలుపును ఆపలేరు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయం, ఎమ్మెల్సీ, వరుదు కళ్యాణి, ఈ ప్రభుత్వం అప్పిరెడ్డి ని కేసుల్లో ఇరికిద్దామని రెండున్నరేళ్లుగా ప్రయత్నిస్తోంది.

ఇప్పుడు కక్షపూరితంగా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారు. బ్యాలెట్ బాక్సులకు భద్రత కల్పించలేని పోలీసుల పై కేసులు పెట్టాలి, బ్యాలెట్ బాక్సులు పక్కదారి పట్టించిన ఎన్నికల సిబ్బంది పై కేసులు పెట్టాలి. కానీ అక్రమాన్ని ప్రశ్నించిన అప్పిరెడ్డి పై కేసు పెట్టారు.

ప్రజా వ్యతిరేకత వచ్చిందని కూటమి నేతలకు అర్ధమైపోయింది. అందుకే నామినేషన్ల వేసిన దగ్గర్నుంచి చేయని దుర్మార్గాలు లేవు, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. 2029లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారు. అక్రమాలు, అన్యాయాలు చేసిన అధికారులకు చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.

ప్రతీ ఒక్కరికీ బుద్ధి చెప్పడం ఖాయం, మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పై తప్పుడు కేసు పెట్టారు. లోకేష్, పెమ్మసాని ఆదేశాలతో, అప్పిరెడ్డి గుంటూరు గాలి పోల్చడానికి వీల్లేదనేలా వ్యవహరిస్తున్నారు. అప్పిరెడ్డి కి రక్షణ కల్పించలేని జైలు సూపరింటెండెంట్ లెటర్ రాశారు.

రక్షణ కల్పించలేకపోతే మీరెందుకు గుడ్డి గుర్రం పళ్లు తోముతారా, బ్యాలెట్ బాక్సు ఎందుకు బస్సులో నుంచి కిందకు దించారు. బ్యాలెట్ బాక్సు వెంట పోలీసులు ఎందుకు లేరు, ఇప్పటివరకూ ఒక్కరైనా సమాధానం చెప్పారా. పట్టాభిపురం సిబ్బంది గంగా వెంకటేశ్వర్లు పై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నా.

బ్యాలెట్ బాక్సు పగలగొట్టి రిగ్గింగ్ కు పాల్పడిన టిడిపి వారి పై కేసులు లేవు, తన సామాకవర్గానికి చెందిన కొమ్మినేని కోటేశ్వరరావుకు మేలు చేయాలని సిఐ ప్రయత్నించారు. ఖాకీ బట్టలేసుకున్న పోలీసులకు కులపిచ్చేంటి, కోయ ప్రవీణ్, చెరుకూరి శ్రీధర్, గంగా వెంకటేశ్వర్లు, వంశీ కులపిచ్చితో కొట్టుకు చస్తున్నారు.

2029లో కచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. మా రియాక్షన్ ను మీరు తట్టుకోలేరు. అప్పిరెడ్డి కి జైల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు, రెండు బారికేడ్ల అవతల అప్పిరెడ్డి ని చూపించారు. గుంటూరు జైల్లో చాలా ప్రత్యేకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. చట్టం ప్రకారం ఎమ్మెల్సీ గా ఉన్న వ్యక్తికి కల్పించవలసిన సౌకర్యాలు కూడా కల్పించలేదు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN