Guntur: చిన్నారులపై వీధి కుక్కల దాడి జీజీహెచ్లో క్షతగాత్రుల పరామర్శ!
Guntur: గుంటూరు ఈస్ట్ రామిరెడ్డి తోటలో చిన్నారులపై వీధి కుక్కల దాడి. జీజీహెచ్లో క్షతగాత్రులను పరామర్శించిన వైయస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా.
Guntur: చిన్నారులపై వీధి కుక్కల దాడి జీజీహెచ్లో క్షతగాత్రుల పరామర్శ!
Guntur: గుంటూరు ఈస్ట్, రామిరెడ్డి తోటలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి. ఘటన విషయాన్ని తెలుసుకొని హుటాహుటిన జీజీహెచ్ కి చేరుకున్న గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా, స్థానిక 8వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద రాణి.
షేక్ నూరి ఫాతిమా, గుంటూరు నగర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈస్ట్ ఇంచార్జ్ కామెంట్స్. వీధి కుక్కల దాడిలో అత్యంత దారుణంగా ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈస్ట్ లోనే కాదు గుంటూరు నగరవ్యాప్తంగా వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి.
నగర ప్రజల ప్రాణాలంటే స్థానిక ఎమ్మెల్యేలకు, నగరపాలక సంస్థకు లెక్క లేదు కుక్కల దాడికి ఎంతమంది చిన్నారులు, మహిళలు బలి కావాలి
కుక్కల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు.
చిన్నారికి కుట్లు వేయాలని, అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారు. పారిశుద్ధ్యం సరిగా లేని, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లోనే వీధి కుక్కలు అధికంగా ఉంటున్నాయి. వీధి కుక్కల నియంత్రణకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.
కూటమి పాలనలో మనుషులపై మనుషులు దాడులు కూడా పెరిగాయి చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమవుతుంది.
గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మా నసీర్ అన్న చదువుకున్న, చదువుకొని వ్యక్తులు మాదిరిగా వ్యవహరిస్తూ ఉంటారు. సమస్య మీద మాట్లాడమంటే తాటతీస్తాను, తోలు వోలుస్తాను, చమడాలు తీస్తాను అని మాట్లాడుతారు ఉన్నత విద్య అభ్యసించి అమెరికాలో బాగా సంపాదించి వచ్చిన గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తా అంటారు.
చదువుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడితే రాష్ట్రం ఎటుపోవాలి. సమాజంలో ప్రశ్నించే గొంతు అవసరం జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. డబ్బుల బలంతో, అరాచకాలతో మేమే గెలుస్తాం అనుకుంటున్న కూటమి నాయకులను ప్రజలు ఓడించి, తగిన బుద్ధి చెప్పాలి.
కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలిస్తే ప్రజలకు దినదినం గండమ్మే. ఏ పని కావాలన్నా రాబందులు మాదిరిగా వాలిపోయి డబ్బులు వసూలు చేస్తారు. వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రజల గొంతుకై నిలుస్తాం. ఈ పేట ప్రజలు నాకు ఓటు వేయలేదు, ఈ వ్యక్తి నాకు ఓటు వేయలేదు అనుకోవడం మంచి విధానం కాదు.
ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గ ప్రజల బాధ్యత తీసుకోవాలి. కూటమి ప్రజా వ్యతిరేక పాలనపై తీర్పు ఇచ్చే అవకాశం కార్పొరేషన్ ఎన్నికల ద్వారా వచ్చింది. ప్రజలు ఈ ఎలక్షన్ లో విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్న ఈస్ట్ 8వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వినోద రాణి టీచర్ చదువుకున్న మహిళలకు అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధి చెందుతుంది.
వీధి కుక్కల నియంత్రణతో పాటు పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది.




