Bapatla: బాపట్లలో ఇళ్ల స్థలాలు, స్మశానాల కోసం యానాదుల ర్యాలీ!

Bapatla: బాపట్ల అంబేడ్కర్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు యానాది గిరిజనుల భారీ నిరసన ర్యాలీ. ఇళ్ల స్థలాలు, స్మశాన భూములు కేటాయించాలని కలెక్టర్‌కు వినతిపత్రం.

B SURESH, BAPATLA
Published on: 22 Sept 2026 11:31 AM IST
Bapatla
X

Bapatla: బాపట్లలో ఇళ్ల స్థలాలు, స్మశానాల కోసం యానాదుల ర్యాలీ!

Bapatla: ఈరోజు బాపట్ల జిల్లా బాపట్ల అంబేద్కర్ సర్కిల్ నుంచి బాపట్ల కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి కార్యాలయం వరకు బాపట్ల జిల్లా యానాదులతో కొంతమంది రాష్ట్ర నాయకులతో నిరసన ర్యాలీ కార్యక్రమం జరిగింది.

ఎందుకనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యానాది జాతి గిరిజన కాలనీలో ముఖ్యంగా స్మశాన స్థలాలు లేవు మరీ మరీ ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేవు ఆ విషయమై ముందుగా బాపట్ల జిల్లా యానాదులతో బాపట్ల శివకృష్ణ యానాది గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ యానాదుల గిరిజన చైతన్య సేవా సంఘం నాయకులతో బాపట్ల జిల్లా యానాది కుటుంబ సభ్యులతో బాపట్ల అంబేద్కర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీగా వెళ్లి యానాదులకు బాపట్ల జిల్లాలో స్మశాన స్థలాలు కేటాయించి వాటిల్లో వెయిటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఇళ్ల స్థలాలు ఇచ్చి గవర్నమెంట్ పక్క ఇల్లు కట్టించాలని యానాది జాతి గిరిజన గిరిజనులను అభివృద్ధి పదంలో నడపాలని యానాది జాతికి అండగా ఉండాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది సార్ సానుకూలంగా స్పందించి మీ యొక్క యానాది జాతి గిరిజన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కొంతమంది రాష్ట్ర నాయకులు బాపట్ల జిల్లా యానాది జాతి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.

B SURESH, BAPATLA

B SURESH, BAPATLA