Guntur: గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో గణేశ్ నిమజ్జనం!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహిళల చేత మట్టి గణపతి నిమజ్జనం.. ప్రారంభించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Sept 2026 7:19 PM IST
Guntur
X

Guntur: గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో గణేశ్ నిమజ్జనం!

Guntur: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఈ ఏడాది ప్రత్యేకంగా మహిళల చేత వినాయకుడిని స్థాపించి, మహిళల చేతనే నిమజ్జనం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి గురువారం ఘనంగా ప్రారంభించారు.

నిమజ్జన వాహనానికి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే, అనంతరం మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వయంగా నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ శ్రీ వినాయక చవితి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పూజలు ముగిసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని కార్యాలయం నుంచి ప్రారంభించి బుడంపాడు కాలువ వరకు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి చెప్పారు.

సాధారణంగా వినాయక చవితి వేడుకలు యువతతో ముడిపడి ఉంటాయని, అయితే మహిళల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మరింత మంది మహిళలతో రెట్టింపు ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.

వినాయకుడు సిద్ధి, బుద్ధి ప్రదాత అని, ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సద్బుద్ధితో, సన్మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా ప్రతి శుభకార్యానికి ముందు ఆయనను పూజించడం భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. చిన్నారులకు జ్ఞానాన్ని బోధించే దేవుడిగా, యువతకు భక్తి, ఉత్సాహాలకు ప్రతీకగా వినాయకుడు నిలిచారని అన్నారు.

సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని జరుపుకునే పండుగ వినాయక చవితి అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నుంచి ఈ వేడుకలను ప్రారంభించడం ఆనందంగా ఉందని, కార్యక్రమానికి హాజరైన మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN