Guntur: సాధారణ సైనికులకు అండగా మహిళా సంఘాలు రూ. 6.92 లక్షల విరాళం
Guntur: సాయుధ దళాల పతాక దినోత్సవానికి డీఆర్‌డీఏ మహిళా సంఘాలు రూ.6.92 లక్షల విరాళం ప్రకటించాయి. చెక్కును కలెక్టర్ సాయికాంత్ వర్మకు డిఆర్‌డిఎ పీడీ అందజేశారు.
Guntur: సాధారణ సైనికులకు అండగా మహిళా సంఘాలు రూ. 6.92 లక్షల విరాళం
గుంటూరు: సాయుధ దళాల పతాక దినోత్సవంకు మహిళా సంఘాలు రూ.6.92 లక్షల విరాళంగా అందించి ఆదర్శంగా నిలిచాయి. ఈ మొత్తం చెక్కును సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ కు డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయ లక్ష్మి అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికులు, యుద్ధంలో గాయపడిన సైనికులు, అమర జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం మహిళా సంఘాల సభ్యులు అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు పతాక చిహ్నాలను స్వీకరించి విరాళాలు అందించి సైనికుల సంక్షేమ కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందజేయాలని కోరారు.
దేశ రక్షణలో సైనికులు చేస్తున్న త్యాగాలను స్మరించుకోవడం, వారికి కృతజ్ఞతలు తెలియజేయడం, వారి కుటుంబాలకు అండగా నిలవడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎక్కువ మొత్తం విరాళంగా సేకరించిన ఎ పి ఎం లకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి ఆర్ గుణశీల, డి.ఆర్.డి.ఏ ఏ.పీ.ఎం లు తదితరులు పాల్గొన్నారు.




