Guntur: చెప్పాం.. చేస్తున్నాం.. ప్రజలకు చూపిస్తున్నాం: ఎమ్మెల్యే బూర్ల
Guntur: చెప్పాం.. చేస్తున్నాం నినాదంతో ప్రత్తిపాడులో రూ.2,000 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు వెల్లడించారు.
Guntur: చెప్పాం.. చేస్తున్నాం.. ప్రజలకు చూపిస్తున్నాం: ఎమ్మెల్యే బూర్ల
గుంటూరు: గుంటూరులోని నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన “చెప్పాం – చేస్తున్నాం” పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
గత రెండేళ్ల నాలుగు నెలల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం, పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనాలు అందించామని తెలిపారు.
అలాగే రోడ్లు, పాఠశాలలు, వీధి దీపాలు, తాగునీటి సదుపాయాల అభివృద్ధితో పాటు గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి కోసం రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు.




