Vinukonda: వినుకొండలో రూ.3 కోట్లతో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన!
Vinukonda: వినుకొండ ఎన్‌ఎస్‌పీ స్థలంలో రూ.3 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో నూతన పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు.
Vinukonda: వినుకొండలో రూ.3 కోట్లతో పార్కు నిర్మాణానికి శంకుస్థాపన!
Vinukonda: వినుకొండ పట్టణంలో అభివృద్ధి పనులకు మరింత ఊతమిస్తూ, ఎన్‌ఎస్‌పీ స్థలం వద్ద రూ.3 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో నూతన పార్కు నిర్మాణానికి ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు, పిల్లలకు ఆహ్లాదకరంగా గడిపేందుకు అనువైన పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. వినుకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పట్టణంలో అవసరమైన ప్రాంతాల్లో డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు, పూల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించనున్నట్లు తెలిపారు. అలాగే స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి, పట్టణ ప్రవేశ మార్గాల్లో ఆకర్షణీయమైన ఆర్చీలను నిర్మించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.వినుకొండ పట్టణానికి మరింత అందాన్ని తీసుకురావడంతో పాటు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తూ వినుకొండను నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని జీవీ ఆంజనేయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




