Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం సిబ్బంది తరలింపు!

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: సిబ్బంది తరలింపు

KAREEMULLA, VINUKONDA
Published on: 31 Oct 2026 2:25 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం సిబ్బంది తరలింపు!

Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పట్టణంలోని నిర్మల హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లేందుకు ఎన్నికల సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామగ్రిని సిబ్బంది అందజేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మొత్తం 14 వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ కమిషనర్ శివరామ ప్రసాద్ ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వాహనాల ద్వారా బయలుదేరనున్నారు.

నవంబర్ 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA