Vinukonda: అక్టోబర్ 7న మెగా జాబ్ మేళా - చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Vinukonda: వినుకొండలో అక్టోబర్ 7న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. 35 కంపెనీల ద్వారా 2 వేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయి.

KAREEMULLA, VINUKONDA
Published on: 6 Oct 2026 4:09 PM IST
Vinukonda
X

Vinukonda: అక్టోబర్ 7న మెగా జాబ్ మేళా - చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ: వినుకొండ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అక్టోబర్ 7న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాలో 35 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, 2,000కు పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.

వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 7వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

టెన్త్ , ఇంటర్మీడియట్, ఐటిఐ , డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బి.టెక్ , బి.ఫార్మసీ , ఎంబీఏ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని జీ.వి. ఆంజనేయులు తెలిపారు.

అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో జాబ్ మేళాకు హాజరై ఉద్యోగాలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA