Vinukonda: వినుకొండలో రూ.3.50 కోట్లతో అభివృద్ధి పనులు: జీవీ ఆంజనేయులు

Vinukonda: వినుకొండ ఎన్‌ఎస్‌పీ స్థలంలో రూ.3.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు.

KAREEMULLA, VINUKONDA
Published on: 12 Oct 2026 2:35 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండలో రూ.3.50 కోట్లతో అభివృద్ధి పనులు: జీవీ ఆంజనేయులు

Vinukonda: వినుకొండ పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పట్టణంలో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు, రహదారుల సుందరీకరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వినుకొండ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ స్థలంలో రూ.3.50 కోట్ల HAM నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు.

ఈ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం, సెంట్రల్ డివైడర్ ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు . ఈ అభివృద్ధి పనులు పూర్తయితే రహదారి మరింత సుందరంగా మారడంతో పాటు, వాహనదారులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

వినుకొండ పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు, పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, ఇతర నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA