Vinukonda: వినుకొండలో ‘నగరవనం’ ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ వెంకుపాలెం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘నగరవనం’ను ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు ఘనంగా ప్రారంభించారు.
Vinukonda: వినుకొండలో ‘నగరవనం’ ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ–వెల్లటూరు రోడ్డులోని వెంకుపాలెం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘నగరవనం’ను ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా అందించిన ప్రత్యేక సందేశాన్ని చీఫ్ విప్ జీ.వి. ఆంజనేయులు, కూటమి నాయకులు, అధికారులు వీక్షించారు.
అనంతరం జీ.వి. మాట్లాడుతూ.. నగరవనం ఏర్పాటు ద్వారా వినుకొండ పట్టణ ప్రజలకు ప్రకృతికి దగ్గరగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించే అవకాశం కలిగిందన్నారు. పిల్లలు, పెద్దలు సేదతీరేందుకు ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు ట్రెక్కింగ్‌కు కూడా నగరవనం ఎంతో అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.
పట్టణ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నగరవనాన్ని సందర్శించి, అక్కడి ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించాలని ప్రజలకు సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జీ.వి. ఆంజనేయులు కోరారు.
కార్యక్రమంలో భాగంగా చీఫ్ విప్ జీ.వి. ఆంజనేయులు, కూటమి నాయకులు, అధికారులు నగరవనం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.




