Vinukonda: ఉపాధ్యాయులపై దాడులు దుర్మార్గం - చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Vinukonda: ఉపాధ్యాయులపై దాడులు చేయడం దుర్మార్గమన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని, ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ.

KAREEMULLA, VINUKONDA
Published on: 21 Sept 2026 8:53 PM IST
Vinukonda
X

Vinukonda: ఉపాధ్యాయులపై దాడులు దుర్మార్గం - చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

వినుకొండ: మెరిట్‌, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు.

ఉపాధ్యాయులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అలాంటి వారిపై రాడ్లు, కర్రలతో దాడులకు పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు.టీచర్లపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని, బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జీవి స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెరిట్‌, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ 16 వేల మంది టీచర్లకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

ఉపాధ్యాయులపై దాడులు చేయడం, హింసాత్మక ఘటనలను ప్రోత్సహించడం సరైన రాజకీయ విధానం కాదని జీవి అన్నారు. ఇలాంటి హింసాత్మక రాజకీయాలకు ప్రభుత్వం చట్టపరంగా తగిన సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, హింసకు పాల్పడే వారికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA