Vinukonda: వినుకొండ అభివృద్ధికి వైసీపీ అభ్యర్థులను గెలిపించండి

Vinukonda: వినుకొండ మున్సిపాలిటీ 5, 6, 7, 8, 9 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రచారం. చైర్మన్ అభ్యర్థి పఠాన్ సలేహా ఖాన్, కౌన్సిలర్లను గెలిపించాలని పిలుపు.

KAREEMULLA, VINUKONDA
Updated on: 24 Oct 2026 7:23 PM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ అభివృద్ధికి వైసీపీ అభ్యర్థులను గెలిపించండి

వినుకొండ: వినుకొండ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 5, 6, 7, 8, 9 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పఠాన్ సలేహా ఖాన్‌తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోని ప్రజలను నేరుగా కలుసుకొని వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు కార్యక్రమాలను అమలు చేసినట్లు బొల్లా బ్రహ్మనాయుడు ప్రజలకు వివరించారు. వినుకొండ పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు తమ మద్దతు అందించాలని కోరారు.

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పఠాన్ సలేహా ఖాన్‌ను గెలిపించడంతో పాటు, పట్టణంలోని మొత్తం 36 వార్డుల్లో పోటీ చేస్తున్న వైసీపీ, సీపీఐ కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తమ అభ్యర్థులకు అవకాశం కల్పించాలని కోరారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA