Vinjanampadu: టైక్వాండో టోర్నమెంట్‌లో కిట్స్ విద్యార్థిని భావనకు రజతం
Vinjanampadu: జేఎన్టీయూ సెంట్రల్ జోన్ టైక్వాండో టోర్నమెంట్‌లో వింజనంపాడు కిట్స్ విద్యార్థిని కేవీఎస్ భావన రజత పతకం సాధించారు; యాజమాన్యం, సిబ్బంది అభినందనలు.
Vinjanampadu: టైక్వాండో టోర్నమెంట్‌లో కిట్స్ విద్యార్థిని భావనకు రజతం
వింజనంపాడు: స్థానిక వింజనంపాడులోని కెకెఆర్ & కెఎస్‌ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్ ) కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కేవీఎస్ భావన ,చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్టీయూ సెంట్రల్ జోన్ టైక్వాండో టోర్నమెంట్‌లో అసాధారణ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి రజత పతకం సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డా. కోయి సుబ్బారావు, కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ మాట్లాడుతూ, విద్యాపరమైన విజయాలతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించడం కళాశాలకు గర్వకారణమని అన్నారు. భావన కఠిన శ్రమ, అంకితభావంతో సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానించారు.
కళాశాల ప్రిన్సిపల్ డా. పి. బాబు, అకడమిక్ డైరెక్టర్ డా. కె. హరిబాబు, ఫ్యాకల్టీ, ఫిజికల్ డైరెక్టర్లు కె. వెంకటరావు, ఎం. సూర్యప్రకాశ్ రావు మరియు సిబ్బంది కేవీఎస్ భావనను హృదయపూర్వకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఆమె రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కళాశాలకు మరింత ఘనకీర్తి తెచ్చేలా ఉంటుందని వారు ఆకాంక్షించారు.




