Vinjanampadu: IETE సౌత్ జోన్ అవార్డు సాధించిన కిట్స్ కళాశాల

Vinjanampadu: IETE ISF అవార్డుల్లో సౌత్ జోన్ స్థాయిలో కిట్స్ కళాశాల ద్వితీయ స్థానం సాధించింది. వినూత్న సాంకేతిక కార్యక్రమాలకు ఈ గుర్తింపు లభించింది.

ANANDBABU,	PRATTIPADU
Published on: 1 Oct 2026 9:02 PM IST
Vinjanampadu
X

Vinjanampadu: IETE సౌత్ జోన్ అవార్డు సాధించిన కిట్స్ కళాశాల

వింజనంపాడు: కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్ )ప్రతిష్ఠాత్మక విజయాన్ని సాధించింది. భారతీయ ఎలక్ట్రానిక్స్ మరియు టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ సంస్థ (IETE) ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ సాంకేతిక, విద్యా మరియు విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా అందించే IETE ISF (Institutional Students' Forum) Awardలో కళాశాల (South Zone) స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది.

ఈ కార్యక్రమంలో 670 కాలేజీలు పాల్గొనగా కిట్స్ కళాశాలకు రెండవ స్థానం లభించింది

ఈ అవార్డు కళాశాలలో నిర్వహించిన వినూత్న సాంకేతిక కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి చేపట్టిన చర్యలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, నిపుణుల ఉపన్యాసాలు, పోటీలు మరియు IETE ISF చాప్టర్ సమర్థవంతమైన కార్యకలాపాలకు గుర్తింపుగా లభించింది.

ఈ కార్యక్రమానికి IETE

చైర్మన్ విజయవాడ సెంటర్ డాక్టర్ బి సూర్యప్రసాదరావు గారు, సెక్రటరీ విజయవాడ సెంటర్ డాక్టర్ షేక్ రియాజుద్దీన్ గారు తో పాటు కళాశాల ఐఎస్ఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం పూర్ణ కిషోర్ గారు అవార్డును అందుకున్నారు

ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ డాక్టర్ కోయి సుబ్బారావు గారు, కళాశాల కార్యదర్శి కోయి శేఖర్ గారు,ప్రిన్సిపాల్ డాక్టర్ పి బాబు గారు , డైరెక్టర్ డాక్టర్ కే హరి బాబు గారు , ప్రొఫెసర్ N ఆదినారాయణ గారు, IETE ISF కోఆర్డినేటర్లు, అధ్యాపకులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ విజయం కళాశాల నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాల పెంపు మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందనే విషయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధిస్తూ విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు కల్పించేందుకు కృషి కొనసాగిస్తామని కళాశాల యాజమాన్యం వెల్లడించింది.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU