Guntur: తల్లీకూతుళ్ల హనీట్రాప్ బాగోతాన్ని బయటపెట్టిన గుంటూరు యువకుడు!
Guntur: విలాసాలకు అలవాటు పడిన తల్లీకూతురు హనీట్రాప్‌తో తన వద్ద రూ. 50 లక్షలు కాజేశారని గుంటూరుకు చెందిన జెల్ది అనిల్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు.
Guntur: తల్లీకూతుళ్ల హనీట్రాప్ బాగోతాన్ని బయటపెట్టిన గుంటూరు యువకుడు!
Guntur: విలాసాలకు అలవాటు పడిన తల్లి, కూతురు హనిట్రాప్ కి పాల్పడుతూ యువకులను రోడ్డున పడేస్తున్నారని గుంటూరు నగరానికి చెందిన జెల్ది అనిల్ మీడియా ముందుకు వచ్చారు. గుంటూరు అరండల్ పేటలో శనివారం అనిల్ మాట్లాడారు. తనను గుంటూరు మారుతీనగర్ కి చెందిన బిందు నాగిని ట్రాప్ చేసి, ఐదేళ్ల పాటు సహజీవనం చేసిందని చెప్పారు. ఇప్పుడు మరో ఇద్దరు వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుతూ తన స్నేహితులని చెప్తుందని, అందులో ఒక వ్యక్తి ఆమె ట్రాప్ లో పడి కాల్ రికార్డింగ్ డేటా ఉన్న తనకు ఫోన్ కుడా ఇచ్చి వెళ్ళాడని అన్నారు. ఇప్పుడు తన బండారాన్ని బయట పెట్టినందుకు బెదిరింపులకు పాల్పడుతుందని చెప్పారు. తన తల్లి చాట్ల లక్ష్మి తో కలిసి.. బిందు నాగిని ఇటువంటి ఘోరాలకు పాల్పడుతుందని, తాను రూ. 50లక్షల వరకు వారి కారణంగా నష్టపోయానని, తనలా మరొకరు వారి భారిన పడకుండా ఉండటం కోసమే తాను మీడియాను ఆశ్రయించానని అన్నారు.




