Vetapalem: వేటపాలెంలో గాంధీజీ జయంతి: ఘన నివాళులర్పించిన ఐవీఎఫ్
Vetapalem: గాంధీ జయంతి సందర్భంగా వేటపాలెం పంచాయతీ ఆవరణలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, అధికారులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Vetapalem: వేటపాలెంలో గాంధీజీ జయంతి: ఘన నివాళులర్పించిన ఐవీఎఫ్
వేటపాలెం: గాంధీజీ జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో వేటపాలెం పంచాయతీ ఆవరణలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేటపాలెం స్టేషన్ ఆఫీసర్ P. జనార్ధన్, పంచాయతీ సెక్రటరీ బాలిగ సురేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ P. జనార్ధన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సూచించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. గాంధీజీ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ, ఇంటర్నేషనల్ మహిళా ఉపాధ్యక్షురాలు చుండూరి గాయత్రి, క్యాష్యూ అసోసియేషన్ అధ్యక్షులు ఊటుకూరి శ్రీనివాసరావు, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు మాజేటి వెంకట సుబ్బారావు, తెలుగు యువత మండల అధ్యక్షులు నాగు, IVF జిల్లా నాయకులు చుండూరి సురేష్, ప్రత్తి పార్థసారథి, శ్రీరామ్ గోవర్ధన్ రావు, చుండూరి నాగాంజనేయులు, చుండూరి శ్రీనివాసరావు, పంచాయతీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




