Vetapalem: వేటపాలెంలో ఘనంగా జాతీయ జీడిపప్పు దినోత్సవ వేడుకలు

Vetapalem: వేటపాలెం అనంత భారత్ క్యాషూ ప్రొడక్ట్స్‌లో జాతీయ జీడిపప్పు దినోత్సవ వేడుకలు; కార్మికులకు ఘన సన్మానం, విద్యార్థుల సందర్శన.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 23 Nov 2026 8:19 PM IST
Vetapalem
X

Vetapalem: వేటపాలెంలో ఘనంగా జాతీయ జీడిపప్పు దినోత్సవ వేడుకలు

వేటపాలెం: వేటపాలెం లో గల అనంత భారత్ క్యాషూ ప్రొడక్ట్స్ నందు జాతీయ జీడిపప్పు దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్త ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ నాణ్యమైన జీడిపప్పు తయారీలో కార్మికుల యొక్క నైపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులను ఘనంగా సత్కరించుట జరిగినది.

కార్యక్రమములో ముఖ్యఅతిథిగా ఇండస్ట్రియల్ ఏరియా లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శివపార్వతి, ఉపాధ్యాయులు నరసింహారావు,గ్రామ పెద్దలు శ్రీమన్నారాయణ పట్టబద్ధుల సంఘం సభ్యులు గుడిమూటి శేఖర్ బాబు, రంగనాథ గుప్తా,వ్యాపారవేత్తలు ,ప్రముఖ సేవా తత్పరులు సుబ్రహ్మణ్యం ఎస్సీ సామాజిక సేవ వేత్త బొల్లేపల్లి బెంజిమెన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొని జీడిపప్పు పరిశ్రమలో నూతన విధానాన్ని తెలుసుకొని ఆనందం వ్యక్తం చేశారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala