Vemuru: వేమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్రిక్తత!
Vemuru: వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం అనంతవరంలో MPTC ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్రిక్తత. ఇళ్లపై దాడి చేసినట్లు బాధితుల ఆరోపణ. పోలీసుల దర్యాప్తు.
Vemuru: వేమూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్రిక్తత!
Vemuru: కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో MPTC ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇండిపెండెంట్ MPTC అభ్యర్థి విజయం సాధించడంతో, ఆ అభ్యర్థికి మద్దతు తెలిపారనే ఆగ్రహంతో కొంతమంది టీడీపీకి చెందిన వ్యక్తులు అర్ధరాత్రి రెండు ఇళ్లపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
దాడిలో ఇళ్ల అద్దాలు, టీవీలు, ఫర్నిచర్‌తో పాటు ఇంట్లోని ఇతర సామగ్రిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇళ్లలో ఉన్న వారిపై కూడా దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే క్రమంలో సైరన్ మోగడంతో దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుంచి పరారైనట్లు బాధితులు వెల్లడించారు. ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థికి మద్దతు తెలిపినందుకే తమపై దాడులకు దిగారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబాలకు ప్రాణరక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.




