Guntur: గుంటూరు నల్లపాడు పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు!

Guntur: గుంటూరు నల్లపాడు పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు.. పలు చోరీ కేసుల్లో కీలక పురోగతి, సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు.

ANANDBABU,	PRATTIPADU
Published on: 18 Sept 2026 7:21 PM IST
Guntur
X

Guntur: గుంటూరు నల్లపాడు పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు!

Guntur: గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన Cr.No.961/2026, U/Sec 308(2) r/w 3(5) BNS కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ P భాస్కర్ SI మధు పవన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి పలుకేసులకు సంబంధించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గుంటూరు రూరల్‌, నల్లపాడు, గుంటూరు నగర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. గుంటూరు రూరల్‌, నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన దొంగతనం కేసులకు సంబంధించిన వస్తువులను వారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో హెచ్‌బీ కాలనీ ఆర్చ్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని బెదిరించి అతని వద్ద నుంచి నగదు, ఇతర వస్తువులను అపహరించినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో AP 07 TE 5580 నంబర్ గల ఆటో, ఒక సెల్‌ఫోన్‌, రూ.1,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అరెస్టయిన నిందితులను *ఉప్పుతల శ్రీకాంత్ (21), ఒద్దు గోపీ (23)*గా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ సీఐ P భాస్కర్ SI మధు పవన్‌తో పాటు పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్, IPS అభినందించారు.

ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్‌-112 లేదా సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని నల్లపాడు సీఐ భాస్కర్ కోరారు.

ANANDBABU,	PRATTIPADU

ANANDBABU, PRATTIPADU