Guntur: గుంటూరులో 16న పి.ఓలకు, 17న ఓ.పి.ఓలకు ఎన్నికల శిక్షణ!

Guntur: గుంటూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నవంబర్ 16న పి.ఓలకు, 17న ఓ.పి.ఓలకు ఉదయం 9 గంటల నుంచి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 14 Nov 2026 5:54 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో 16న పి.ఓలకు, 17న ఓ.పి.ఓలకు ఎన్నికల శిక్షణ!

గుంటూరు: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు (పి.ఓలు) కు ఈ నెల 16న, ఇతర పోలింగ్ సిబ్బందికి (ఓ.పి.ఓలకు) 17వ తేదీన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ సీఎం సాయికాంత్ వర్మ చెప్పారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆయా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి జరిగే శిక్షణ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరయ్యే ఉద్యోగుల పట్ల ఎన్నికల నిబంధనల మేరకు క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN