Edlapadu: తిమ్మాపురంలో ఎస్‌ఎంసీ ఎన్నికల రగడ
Edlapadu: తిమ్మాపురం జడ్పీ పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికల రగడ. హెచ్‌ఎం కిడ్నాప్‌పై ఎంఈఓ ఫిర్యాదు. తోపులాట, ఘర్షణలతో వాయిదా పడిన ఎన్నికలు.
Edlapadu: తిమ్మాపురంలో ఎస్‌ఎంసీ ఎన్నికల రగడ
ఎడ్లపాడు: పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎంసీ ఎన్నికలను కొందరు సభ్యులు ఆధిపత్య పోరుగా తీసుకోవడంతో వివాదం తలెత్తినట్లు సమాచారం.
ఉదయం పాఠశాలకు వస్తున్న హెడ్మాస్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ మండల ఎంఈఓ నాగరత్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఎన్నికలు కొనసాగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోకి వచ్చి ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘటనలో కొంతమందికి గాయాలైనట్లు సమాచారం. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురై వెనుదిరిగారు.పరిస్థితుల నేపథ్యంలో తిమ్మాపురంలో జరగాల్సిన ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా పడినట్లు సమాచారం.




