Palnadu: దాచేపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం!
Palnadu: గామాలపాడు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మట్టిలోడు కంటైనర్ లారీ డివైడర్ దాటి డీసీఎం లారీపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Palnadu: దాచేపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం!
Palnadu: దాచేపల్లి మండలం గ్రామాలపాడు వద్ద అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే గ్రామాలపాడు గ్రామంలోని సమీపంలో గల గోడౌన్స్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఆంధ్ర వైపు నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న డిసీఎం లారీని , తెలంగాణ నుంచి ఆంధ్ర వైపు వస్తున్న మట్టిలోడు కంటైనర్ లారీ అదుపుతప్పి డివైడర్ దాటుకొని వెళ్లి అటుగా ప్రయాణిస్తున్న డీసీఎం లారీ మీద పడటంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
దాచేపల్లి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుమీద చల్లా చదురుగా పడి ఉన్న లారీలను మరియు డీసీఎం లారీలను పక్కకు తొలగించి సహాయక చర్యలు చేపట్టారు.
.. మృతదేహాలను మరియు క్షతగాత్రులను స్థానికంగా ఉన్న గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




