Savalyapuram: శావల్యాపురంలో ఎంపీటీసీ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత!
Savalyapuram: పల్నాడు జిల్లా శావల్యాపురంలో ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేతల కారు ఢీకొని నలుగురు టీడీపీ కార్యకర్తలు, ఎస్సైకి గాయాలయ్యాయి.
Savalyapuram: శావల్యాపురంలో ఎంపీటీసీ నామినేషన్ల వేళ తీవ్ర ఉద్రిక్తత!
Savalyapuram: వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురంలో ఎంపీటీసీ నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు ముగియడానికి కేవలం పది నిమిషాల సమయం మాత్రమే ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.వైసీపీ నాయకులు కారుతో వేగంగా దూసుకొచ్చారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఆ కారును అడ్డుకునే ప్రయత్నంలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఎస్సై మోర్ల వెంకటేష్‌బాబుకు కూడా స్వల్ప గాయమైంది.
ప్రమాదంలో కొమ్మతోటి రవిబాబు కాలు విరిగినట్లు సమాచారం. గోనుగుంట్ల మహేష్‌కు కుడిచేతికి గాయం కాగా, సిద్దెల సామేలుకు తీవ్ర గాయాలయ్యాయి. సోమేపల్లి వెంకట్రావు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు.




