Vinukonda: టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా చెక్కుల అందజేత!
Vinukonda: వినుకొండలో టీడీపీ ప్రమాద బీమా పథకం కింద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అందజేశారు.
Vinukonda: టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల బీమా చెక్కుల అందజేత!
Vinukonda: టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు కొండంత అండగా పార్టీ ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో టీడీపీ కుటుంబ సభ్యుల ప్రమాద బీమా పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నూజెండ్ల మండలం ములకలూరు గ్రామానికి చెందిన సాంసోను మంద, బొల్లాపల్లి మండలం సరికొండపాలెం గ్రామానికి చెందిన కొండబోయిన నాగేశ్వరరావు అకాల మరణం పట్ల జీవీ ఆంజనేయులు సంతాపం వ్యక్తం చేశారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం టీడీపీ ప్రమాద బీమా పథకం కింద మంజూరైన ఆర్థిక సహాయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇరు కుటుంబాలకు చెరో రూ.5 లక్షల చొప్పున, మొత్తం రూ.10 లక్షల ప్రమాద బీమా పరిహారం చెక్కులను జీవీ ఆంజనేయులు అందించారు.
ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ కేవలం రూ.100 సభ్యత్వంతో టీడీపీ కుటుంబంలో చేరిన ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆపద సమయంలో కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.కార్యకర్తలకు భరోసా కల్పించేలా పార్టీ అమలు చేస్తున్న ప్రమాద బీమా పథకం ఉపయోగకరంగా ఉంటుందని జీవీ పేర్కొన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




