Vinukonda: వినుకొండ మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి చెరుకుపాలెం షమీమ్ ఖాన్!

Vinukonda: పల్నాడు జిల్లా వినుకొండ పురపాలక సంఘం చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పి.ఎస్. ఖాన్‌పై 5,445 ఓట్ల భారీ మెజార్టీతో విజయం.

KAREEMULLA, VINUKONDA
Published on: 4 Nov 2026 7:55 AM IST
Vinukonda
X

Vinukonda: వినుకొండ మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి చెరుకుపాలెం షమీమ్ ఖాన్!

Vinukonda: వినుకొండ పురపాలక సంఘం చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి కైవసం చేసుకుంది. చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చెరుకుపాలెం షమీమ్ ఖాన్ ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.ఎస్. ఖాన్‌పై 5,445 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు.

దీంతో వినుకొండ మున్సిపాలిటీలో కూటమి శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు షమీన్ ఖాన్ ను ఘనంగా సత్కరించి అభినందించారు. కూటమి ఐక్యంగా మరో 15 ఏళ్లు ఉండాలని ఆకాంక్షించారుఎన్నికల ఫలితాల అనంతరం నూతన చైర్మన్ షమీమ్ ఖాన్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన వినుకొండ పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సహకారంతో పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 36 వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు.

తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ వంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వినుకొండను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని షమీమ్ ఖాన్ పేర్కొన్నారు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA