Guntur: గుంటూరులో రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి!

Guntur: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెట్లపై నుంచి పడిపోయిందని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ, పాప ఒంటిపై కొరికిన గాయాలు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 17 Oct 2026 12:54 PM IST
Guntur
X

Guntur: గుంటూరులో రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి!

Guntur: ఇంట్లో మెట్ల మీద నుంచి జారి పడి మృతి చెందిందని గుంటూరు ప్రభుత్వ వైద్యశాల అత్యవసర విభాగానికి తీసుకువచ్చిన తల్లితండ్రులు. మృతి చెందిన తర్వాత ఎమ్మెల్సీ కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు పంపిస్తాం అనగా గొడవ మొదలుపెట్టిన తల్లిదండ్రులు.

అనుమానం వచ్చిన గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వైద్యులు పాప శరీరాన్ని తనిఖీ చేయగా ఒంటినిండా పంటిగాటి గాయాలు కొరికిన గాయాలు ఉండటంతో షాక్కు గురైన సిబ్బంది.

వెంటనే ఔట్ పోస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చి తల్లిదండ్రుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న వైద్య సిబ్బంది. పొంతన లేని సమాధానాలు చెబుతున్న తల్లి.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN